బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కీలక ప్రకటన చేశారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని.. నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికినం అనేది ముఖ్యం కాదని.. ఎలా బతికామనేదే ముఖ్యమని చెప్పారు. ఇందుకు నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం అని అన్నారు.