దేశంలోని లాయర్లకు సుప్రీం కోర్ట్ కీలక సూచనలు జారీ చేసింది. తమ క్లెయింట్లతో పాటు ప్రత్యర్థి లాయర్లు, వారి క్లెయింట్లతో కూడా గౌరవపూర్వకంగా మెలగాలని స్పష్టం చేసింది. కోర్ట్ ప్రాంగణంలో ఎలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడినా.. సదరు లాయర్‌పై రాష్ట్ర బార్ కౌన్సిల్ సహా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా చర్యలు తీసుకోవచ్చని సూచించింది. అడ్వకేట్స్ యాక్ట్- 1961 ప్రకారం, ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం వాంఛనీయం కాదని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ బెంచ్ వివరించింది.