ప్రజలను ఇబ్బంది పెట్టేలా నిరసనలు ప్రభుత్వం ఒప్పుకోదని సిఎం చంద్రబాబు తెలిపారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించమని అన్నారు. కర్నూలు లో మెగా డిఎస్సి 2025 టీచర్ల సంఘీభావ ర్యాలీలపై సిఎం స్పందించారు. బస్టాండ్లు, రహదారుల వెంబడి నిరసనలు అంటే ప్రభుత్వం ఊరుకోదని చంద్రబాబు హెచ్చరించారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్ లే తప్ప ఒక్కరైనా మెగా డిఎస్సి అభ్యర్థి ఉన్నారా? అని ప్రశ్నించారు. ఐక్యంగా టీచర్లు తమ ఆత్మగౌరవం చాటారని చంద్రబాబు పేర్కొన్నారు.