ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆగస్టు 8న ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT ఢిల్లీ) 57వ దీక్షాంత సమారోహంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మోదీ.. అకడమిక్ ఎక్సలెన్స్‌ను గుర్తిస్తూ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, డైరెక్టర్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ టెన్ గోల్డ్ మెడల్స్ వంటి సంస్థ అత్యున్నత గౌరవాలను మెరిటోరియస్ విద్యార్థులకు ప్రదానం చేశారు. దేశ యువతను చూస్తే గర్వంగా ఉంది అన్నారు. భవిష్యత్ భారత నిర్మాతలు మీరే అని వారిని మెచ్చుకున్నారు.