సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ రమేష్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, తన స్థానంలో రవి అనే ప్రైవేట్ వ్యక్తిని కూర్చోబెట్టి డ్యూటీ చేయిస్తున్న మాట వాస్తవమేనని తేలడంతో ప్రభుత్వం ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుడి స్థానంలో ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడనే వ్యవహారంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు