మత్తో’న్మాది..వైద్య విద్యార్థిని బలి తీసుకున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.. దీనికి సంబంధించి లభ్యమైన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసినదేనని స్పష్టమవుతోందని పలువురు పేర్కొంటున్నారు. హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఇది మద్యం మత్తులో జరిగిన ఘటన అని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. నిందితులను నామవరానికి దస్వంత్, జోసఫ్గా గుర్తించారు.