అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఈ ఏడాది సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో, ఇప్పటివరకు సుమారు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.9.5 లక్షల కోట్లు) టారిఫ్లను అమెరికా ప్రభుత్వం దిగుమతిదారులకు తిరిగి చెల్లించింది. మంగళవారం కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక అధికారాల చట్టం కింద విధించిన సుంకాల ద్వారా మొత్తం సుమారు 166 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అందులో దాదాపు 60 శాతం, అంటే సుమారు 100 బిలియన్ డాలర్లను ఇప్పటికే తిరిగి చెల్లించింది.