ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సమాయత్తమవుతోంది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహకాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.ఓటర్ల జాబితాల సవరణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు మరియు యంత్రాంగం యొక్క సంసిద్ధతపై అధికారుల నుంచి నివేదికలు కోరుతూ, పారదర్శకంగా ఎన్నికలు పూర్తి చేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.