తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్.. లైంగిక ఆరోపణల కేసులో దోషిగా తేలారు. 2013 నాటి కేసులో బాంబే హైకోర్టుకు చెందిన గోవా బెంచ్ ఇవాళ తీర్పును ఇచ్చింది. జూనియర్ ఉద్యోగినిని ఓ హోటల్లో రేప్ చేసినట్లు తరుణ్ తేజ్పాల్పై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో 2021లో ట్రయల్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా తేల్చింది. కానీ ఆ తీర్పును గోవా ప్రభుత్వం సవాల్ చేసింది. 2013లో గోవాలో ఈవెంట్ సమయంలో జర్నలిస్టు తేజ్పాల్ తనను హోటల్ ఎలివేటర్లో లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు.