అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న అధ్యక్ష హెలికాప్టర్ ‘మెరైన్ వన్’కు తృటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో మెరైన్ వన్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఎన్వాయ్ ఎయిర్ వాణిజ్య ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి వచ్చింది. ఫైలట్ సమయస్పూర్తితో ప్రమాదం తప్పింది. ఫ్లోరిడాలోని పెన్సకోలాకు వెళ్తున్న మెరైన్ వన్, బయలుదేరుతున్న ప్యాసింజర్ జెట్ మధ్య కొద్దిసేపు భద్రతా దూరం తగ్గింది. అయితే వెంటనే రెండు విమానాలు ఒకదానికొకటి దూరంగా వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.