రాష్ట్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా విపత్తుల నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం.. శ్రీకాకుళం, కోనసీమ, అల్లూరి జిల్లాలోని పోలవరం ప్రాంతం, గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం (మార్కాపురం పరిసరాలు), కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు