అక్కినేని ఇంటి కోడలు, ప్రముఖ నటి శోభితా ధూళిపాళ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు బలమైన వామపక్ష (లెఫ్టిస్ట్) భావజాలం ఉందని, ఏదో ఒక రోజు కమ్యూనిజం తప్పకుండా గెలుస్తుందని పేర్కొనడం విశేషం. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్ట్ సూత్రాలను విశ్వసించే శోభిత, తన వద్ద ఉన్న విలాసవంతమైన ఆస్తులు, లగ్జరీ లైఫ్‌ను వదులుకుని వాటిని ఎందుకు విరాళంగా ఇవ్వడం లేదంటూ కొందరు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.