బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు. రేపల్లెకు చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేత గూడపాటి శ్రీనివాసరావు అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న గూడపాటి.. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరినట్లు తెలిపారు.