సమైక్యాంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశాం. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటం అవుతాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం రూ.95,231గా ఉండేది. విభజన తర్వాత తెలంగాణ GDP రూ.1,24,104, ఏపీలో GDP రూ.93,903. ఈ పరిస్థితుల నుంచి సీఏజీఆర్ 13.5 శాతం వృద్ధి స్థాయికి చేరాం. 2019-24 మధ్య జీఎస్ డీపీ వృద్ధిరేటు 3.18 శాతం తగ్గింది. వృద్ధిరేటు తగ్గడంతో రూ.6.94లక్షల కోట్ల నష్టం జరిగింది.