ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు బరితెగించి ప్రైవేటు ఆస్తులు కాజేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఉరవకొండలో మంత్రి పయ్యావుల కేశవ్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనకు ప్లాన్ చేసింది. ఉరవకొండలోని వేల్పుమడుగులో వైసీపీ నేతకు చెందిన భూమిని మంత్రి పయ్యావుల కేశవ్ ఆక్రమించుకున్నారని వైసీపీ విమర్శిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయన భూదందా పెరిగిపోతుందని నేడు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇరువర్గాల మధ్య సాగుతున్న పోటాపోటీ నిరసనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.