రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరిపి నిర్ణయాలు ప్రకటించకుండా కాలయాపన చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ. 25 వేల కోట్లకు చేరాయని ఏపీ జేఏసీ నాయకులు వెల్లడించారు. తాము ఉచితాలు లేదా బోనస్లు అడగడం లేదని, చట్టబద్ధంగా రావలసిన బకాయిలనే డిమాండ్ చేస్తున్నామని రాష్ట్రవ్యాప్త ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.