స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చెరగని ముద్ర వేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు చిరస్మరణీయ గౌరవం దక్కనుంది. విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా ప్రారంభమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్ద అల్లూరి సీతారామరాజు భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆంగ్లేయులపై విల్లు ఎక్కుపెట్టి గర్జించిన ఆయన రౌద్ర రూపాన్ని ప్రతిబింబించేలా విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు. విమానాశ్రయానికి వచ్చే దేశీ, విదేశీ ప్రయాణికులకు అల్లూరి త్యాగం, వీరత్వం మరియు తెలుగువారి పౌరుషం తెలిసేలా దీనిని డిజైన్ చేశారు