ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులు బిక్షమెత్తుకోవాలా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగ్రహంగా ప్రశ్నించారు. రంజాన్‌కు రూ. 33 కోట్లు కేటాయించి, బోనాలకు రూ. 20 కోట్లే కేటాయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని ఆమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు.