దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరుతో సాగే 100 వారాల జాతీయస్థాయి కార్యక్రమాన్ని ఆదివారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశ యువత మాదకద్రవ్యాల వినియోగాన్ని వీడాలని, డ్రగ్ ఫ్రీ ఇండియా నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తామని ప్రధాని అన్నారు.