ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ అయ్యారు. ఎమ్మెల్యేతో పాటుగా మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆలూరు కోర్టులో హాజరుపరిచారు.శనివారం రోజు రాత్రి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్లదాడులు జరిగాయి. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టును మాజీ మంత్రి విడదల రజిని ఖండించారు. ఆరోపణ నిజమో కాదో తేలకముందే టీడీపీ నేతలతో తీర్పులు.. పోలీసులతో కేసులు.. అరెస్టులు. సీదిరి అప్పలరాజు నుంచి విరూపాక్షి వరకు ఇదే కుట్రపూరిత విధానం కొనసాగుతోందని విడదల రజినీ ఆరోపించారు.