మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను.. కామన్వెల్త్ గేమ్స్ వరుసగా మూడో బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2014లో రజతం గెలిచిన ఆమె.. ఆ తర్వాత మూడు ఎడిషన్లలో వరుసగా స్వర్ణాలు అందుకున్నారు. మొత్తంగా నాలుగు కామన్వెల్త్ పతకాలు సాధించిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. భారత్ కు పతకం అందించడం, మణిపూర్ కు చెందిన క్రీడాకారిణిగా దేశానికి గర్వకారణం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.