భగీరథ ప్లాంట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న వేణు కుమార్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ముదిగొండ మండలంలో కలకలం రేపింది. సాయంత్రం సమయంలో నిరుద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో సూసైట్ నోట్ పోస్ట్ చేసి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గత 5 సంవత్సరాలుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా. ఒక్కసారి మాత్రమే గ్రూప్స్ రాశా. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వడంలేదని మనస్తాపానికి గురై తను ఆత్మహత్యాయత్నం చేశానని సూసైడ్ లేఖలో వేణు కుమార్ వెల్లడించాడు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.