సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే శనివారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో తన నివాసం వద్ద ప్రజలను కలుసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా అసౌకర్యం అనిపించి ఇంట్లోకి వెళ్లగానే ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయని డాక్టర్ చెప్పారు. దీప్కే రక్తపోటు స్వల్పంగా తక్కువ స్థాయిలో 100/60లో ఉందన్నారు. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉదయం నుంచి ఆయనకు వికారంగా ఉందన్నారు. రెండుసార్లు ఆయనకు వాంతులు, నీళ్ల విరేచనాలు అయ్యాయన్నారు. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని, విశ్రాంతి తీసుకుంటే వెంటనే కోలుకుంటారన్నారు.