ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు , కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా ఏపీ జేఏసీ మరోసారి పోరుబాట పట్టింది. బకాయిలు పడిపోయిన ఆర్థిక లబ్ధులు, నిలిచిపోయిన డీఏలు మరియు నూతన వేతన సవరణ సంఘం నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఏపీ జేఏసీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే వచ్చే రోజుల్లో సచివాలయ ముట్టడి, కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలు, నిరవధిక సమ్మె దిశగా కార్యాచరణను ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ స్పష్టం చేసింది.