కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందగా.. పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పతనంతిట్ట జిల్లాలో భారీ వర్షానికి పంపానది పోటెత్తింది. రాన్వీపట్టణం సహా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు వరకు నీరు చేరడంతో బోట్లసాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.