మొరాకో నుంచి స్పెయిన్లోకి అక్రమంగా చొరబడ్డ వలసదారులు గంటల వ్యవధిలోనే సొంత దేశానికి తిరుగుముఖం పట్టారు. గురువారం స్పెయిన్లోకి అడుగుపెట్టిన 60,000 మందిలో దాదాపు 45,000 మందికిపైగా శుక్రవారం మొరాకో వెళ్లిపోయినట్లు అంచనా. సముద్రంలో ఈదుకుంటూ వస్తుండగా 57 మంది మొరాకో వాసులు మరణించి ఉంటారని అంచనా. అయితే, వారికి అక్కడ ఆశ్రయం, ఆహారం, నీరు కూడా లభించలేదు. తాను ఐదు గంటలు ఈదుకుంటూ స్పెయిన్ వచ్చానని, కానీ, తనపై అక్కడి సైన్యం దారుణంగా దాడి చేసిందని ఒక వలసదారుడు తెలిపాడు.