మహనీయుడు స్వామి వివేకానంద భారతీయ యువతకు అందించిన సందేశాన్ని, ఆయన ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించే దిశగా మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో నిర్మించిన “స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం – వివేక స్మార్క్” ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. సుమారు 81,000 చదరపు అడుగులకు పైగా నిర్మిత ప్రాంతంలో ప్రధాన భవనం మరియు అనుబంధ భవనంతో ఈ కేంద్రం రూపుదిద్దుకుంది స్వామి వివేకానంద జీవిత విశేషాలను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా 4D అనుభవ కేంద్రం ఏర్పాటు చేశారు.