అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు.