భారత జావెలిన్ స్టార్ త్రోయర్ నీరజ్ చోప్రా.. కామన్‌వెల్త్ క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మరో ఇండియన్ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన చివరి త్రోతో యశ్వీర్ అనూహ్య రీతిలో మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన 28 ఏళ్ల నీరజ్ చోప్రా .. కామన్‌వెల్త్ గేమ్స్‌లో రెండో అటెంప్ట్‌లో 85.83 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరాడు.