భారత్ ఖాతాలో 9వ రోజు రెండో స్వర్ణం వచ్చి చేరింది. తాజాగా జూడో పురుషుల 60 కేజీల విభాగంలో హర్ష్ సింగ్ బంగారు పతకాన్ని అందుకున్నాడు. 4 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ బౌట్లో హర్ష్ సింగ్ ఆస్ట్రేలియాకు చెందిన జోషజవా కట్ట్ను చిత్తు చేసి పసిడి పతకం ఒడిసిపట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ లో పురుషుల జూడో విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి అథ్లెట్ గా హర్ష్ సింగ్ నిలిచాడు. ఇది భారత్ కు ఐదో స్వర్ణం కాగా,పతకాల సంఖ్య 19కి చేరినట్లయింది.