ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్ పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి.
ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు షెడ్యూల్ ను ప్రకటించింది. ఎయిరిండియా విమానాలు హైదరాబాద్- భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మూడో సర్వీసును, విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది.

