పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. భారత్-అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మరోసారి శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు. వారిని ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి పరిస్థితులు 2020-21 వ్యవసాయ చట్టాల ఉద్యమం, 2024 అన్నదాతల ఆందోళనలను గుర్తుచేస్తున్నాయి. అమెరికా నుంచి భారీ సబ్సిడీలతో వచ్చే వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశముందని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.