దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను సంస్కరించేందుకు, ఒక హైపవర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షల సంస్కరణలపై దృష్టి పెడుతుంది. నందన్ నీలేకనితో పాటు మరో ఐదుగురు ఈ టాస్క్ ఫోర్సులో సభ్యులుగా ఉంటారు. యస్. సోమనాథ్ (ఇస్రో మాజీ ఛైర్మన్), తపన్ డేకా (ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్), వి. కామకోటి (ఐఐటీ మద్రాస్ డైరెక్టర్), అనితా కర్వాల్ (కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి), అమృత్ లాల్ మీనా (లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణుడు).