ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో విడుదల చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలపై సిఫార్సులకు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ ఫోర్స్న ఏర్పాటు చేసినట్లు అందులో ప్రకటించారు. ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. “ప్రశ్నపత్రాల లీకేజీ అరికట్టేందుకు కఠినమైన చట్టం తీసుకొస్తున్నాం. పరీక్షల సంస్కరణలపై కొత్త చట్టాన్ని రేపు పార్లమెంటులో ప్రవేశపెడతాం. విశ్వసనీయమైన, పారదర్శకమైన పరీక్ష విధానం అమలు చేస్తాం” అని అన్నారు.