నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం కారణంగా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో భారీ ప్రక్షాళన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో ఎన్టీఏ నుంచి 47 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల వ్యవధిలో ఎన్టీఏను సమూలంగా ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తోంది. లీకులకు ఆస్కారం లేకుండా.. ఔట్ సోర్సింగ్ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జేఈఈ, నీట్ సహా పలు పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది.