నీట్ పేపర్ లీక్ పై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న పిల్లలపై దమనకాండ ఆపాలని.. ఢిల్లీలో పోలీసుల జులుం నశించాలని కేటీఆర్ మండిపడ్డారు. విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలన్నారు. రాజ్యమా ఉలికిపడు అంటూ.. ఎవరితో పెట్టుకోవొద్దో వాళ్ళతోనే మోదీ పెట్టుకున్నాడని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని అన్నారు.