ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్‌ఎస్ పోరుబాట పట్టింది. దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బర్త్ డే వేడుకలను సైతం రద్దు చేసుకుని, నల్ల చొక్కాతో ఆయన నిరసన పాల్గొన్నారు. ఆర్ఎస్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్దకు విద్యార్థులు ఉప్పెనలా తరలివచ్చారు.