తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 24న విద్యాసంస్థల బంద్ కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్ పేపర్ లీకేజీ దోషులను శిక్షించడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 24వ తేదీన నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ ప్రకటన విడుదల చేసింది. ఆయా పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో చెబుతామని పేర్కొంది. జేఎన్టీయూ పరిధిలోనూ 24న జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు.