నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని రాహుల్ గాంధీ చెప్పారు.మొదట ఇండియా గేట్ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థులు ఒంటరివారు కాదన్న రాహుల్ వారితో తామంతా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటించారు.మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాహుల్ గాంధీ నివాసం చుట్టుపక్కల బందోబస్తు పెంచారు.