కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు అప్పుడే ఓ పతకం ఖాయమైంది. మహిళల 75 కేజీల విభాగంలో బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ కు పతకం దక్కనున్నది. దీంతో గ్లాస్‌గోవ్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం దాదాపు ఖాయమైంది. బాక్సింగ్‌లో లవ్లీనా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమెకు బై దక్కింది. దీంతో ఆమె నేరుగా సెమీస్‌కు వెల్లింది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా.. లవ్లీనాకు మాత్రం కనీసం కాంస్య పతకం దక్కనున్నది.