ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దిల్లీ పర్యటనలో భాగంగా నేడు పార్లమెంట్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన జరగనున్న భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ ప్రత్యేక భేటీ సందర్భంగా ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను సీఎం చంద్రబాబు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.