loader

ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దిల్లీ పర్యటనలో భాగంగా నేడు పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన జరగనున్న భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆయన ప్రధానిని సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రత్యేక భేటీ సందర్భంగా ప్రధాని మోదీకి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను సీఎం చంద్రబాబు బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీ భవన్ వద్ద కర్రలతో కొట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు

ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ మహేహ్‌ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది.  కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ గాంధీ భవన్‌ను ముట్టడించడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు.దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ దాడిలో ఓ రిపోర్టర్ తలకు గాయమవడంతో హాస్పిటల్‌కు తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON