ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేహ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోనళలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి కౌంటర్‌గా బీజేపీ గాంధీ భవన్‌ను ముట్టడించడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పరస్పరం రెండు పార్టీల కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు.దీంతో ఇరు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ దాడిలో ఓ రిపోర్టర్ తలకు గాయమవడంతో హాస్పిటల్‌కు తరలించారు.