త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ అనుమానాస్పద స్థితిలో సోమవారం మృతి చెందారు. అగర్తలాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. ఆయనను గమనించిన సిబ్బంది వెంటనే అగర్తలాలోని గోవింద్ బల్లభ్ పంత్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయన మరణానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.