దేశంలో కొన్నాళ్లపాటు ఉన్న కరోనా మహమ్మారి మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అక్కడక్కడా కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్నప్పటికీ ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. కానీ ఏపీలో మాత్రం వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 20 రోజుల్లో రాష్ట్రంలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా కడపలో 8 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూశాయి.