మయన్మార్ దేశానికి చెందిన మైనారిటీ వర్గమైన రోహింగ్యాల శరణార్థులతో వెళ్తున్న రెండు పడవలు బంగాళాఖాతంలో బోల్తాపడడంతో దాదాపు 500 మందికి పైగా మరణించి ఉంటారని అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి జూన్ చివరి వారంలో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి ఈ రెండు పడవలు బయలుదేరాయి. రెండు పడవల్లో ఒకదానిలో 250 మంది.. బయలుదేరిన కొద్దిసేపటికే అది నియంత్రణ కోల్పోయి సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు 280 మందితో ప్రయాణిస్తున్న రెండో పడవ జులై 8వ తేదీన మయన్మార్‌లోని అయేయార్వాడి తీరంలో మునిగిపోయినట్లు తెలుస్తోంది.