కొన్ని నెలల క్రితం తక్కువ ధరకే లభించిన ఉల్లిపాయలు, ఇప్పుడు అమాంతం పెరిగిపోవడంతో వంటగది బడ్జెట్ మారిపోయింది. కేంద్రం కనీస మద్దతు ధర పెంచిన ప్రభావం నేరుగా మార్కెట్ మీద కనిపిస్తోంది. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం వస్తున్నా, సామాన్య ప్రజలు మాత్రం ఉల్లి కొనేందుకు వెనకాడుతున్నారు.మే నెలలో క్వింటా ఉల్లి ధర కేవలం రూ.1500 లోపు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అదే ఉల్లి ధర రూ.3000, కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.2125 కు పెంచడం వల్ల ఈ మార్పు వచ్చింది.ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.35 నుండి రూ.40 వరకు విక్రయిస్తున్నారు.