నీట్ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా నిరవధిక నిరాహారదీక్షలో ఉన్న విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోంది. నిరాహారదీక్ష ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయన 8.2 కిలోల బరువు తగ్గారు. సోమవారం వాంగ్‌చుక్ రక్తంలో షుగర్ నిల్వలు 67 ఎంజీ/డీఎల్‌కు పడిపోయాయని, బీపీ 107/70 ఎంఎం హెచ్‌జీగా నమోదైందని వైద్యులు వెల్లడించారు. వాంగ్‌చుక్ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.