ఈనెల 18వ తేదీన టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఒక సంచలన రాజకీయ ప్రకటన చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. అమరావతి వేదికగా సర్క్యులేట్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని వారు కొట్టిపారేశారు. జూలై 18న జరగబోయే కార్యక్రమం పూర్తిగా సేవా దృక్పథంతో కూడినదని అసోసియేషన్ వెల్లడించింది. ‘మా ఊరు వాడ’ అనే పేరుతో చేపట్టబోయే కార్యక్రమాన్ని చాలా కాలం క్రితమే రూపకల్పన చేశామని వారు పేర్కొన్నారు.