తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. రైతుల పంట పొలాల్లో నీళ్లు పారించండి ముఖ్యమంత్రి అంటే మా రక్తాన్ని పారిస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన బాధ్యతేనా..? సీఎం మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారు. పొలాల్లో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారు. నిన్న బోధి పెవీలియన్‌లో మాట్లాడిండు.. పేరేమో బోధి పెవీలియన్.. మాటలేమో హింసను తలపించే మాటలు